'రామారావు ఆన్ డ్యూటీ' రిలీజ్ డేట్ వాయిదా!

26-05-2022 Thu 18:53
  • నిరాశపరిచిన రవితేజ 'ఖిలాడి'
  • విడుదలకి సిద్ధమైన 'రామారావు ఆన్ డ్యూటీ'
  • కథానాయికగా పరిచయమవుతున్న రజీషా విజయన్ 
  • కీలకమైన పాత్రలో వేణు తొట్టెంపూడి
Rama Rao On Duty Movie Update
రవితేజ కథానాయకుడిగా 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా నిర్మితమైంది. ఎస్ ఎల్ వి సినిమాస్ వారు నిర్మించిన ఈ సినిమాకి రవితేజ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. దర్శకుడిగా శరత్ మండవ ఈ సినిమాతో పరిచయమవుతున్నాడు. సామ్ సీఎస్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో రవితేజ ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నాడు.

ఈ సినిమాను జూన్ 17వ తేదీన విడుదల చేయనున్నట్టుగా కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేసినట్టుగా అధికారిక ప్రకటన చేశారు. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడనేది త్వరలో ఎనౌన్స్ చేస్తామని అన్నారు. 'ఖిలాడి' తరువాత రవితేజ నుంచి వస్తున్న ఈ సినిమా మరికొన్ని రోజుల్లో విడుదల అనగా వాయిదా పడటం అభిమానులకి నిరాశను కలిగించే విషయమే. 

ఈ సినిమాలో 'మజిలీ' ఫేమ్ దివ్యాన్ష కౌశిక్ అలరించనుంది. ఈ సినిమాతో తెలుగు తెరకి రజీషా విజయం అలరించనుంది. సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి చాలా గ్యాప్ తరువాత ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. నాజర్ .. నరేశ్ ... పవిత్ర లోకేశ్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషించారు.