ఎన్టీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీత‌క్క నివాళి

26-05-2022 Thu 18:36
  • ఎల్లుండి ఎన్టీఆర్ శ‌త జ‌యంతి వేడుక‌
  • ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్‌కు నివాళి అర్పించిన సీత‌క్క‌
  • ఫొటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన టీడీపీ అభిమాని
congress mla sethakka tributes to tdp founder ntr
టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌క‌రామారావు శ‌త జ‌యంతి వేడుక‌లు మ‌రో రెండు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఎన్టీఆర్ శ‌త జ‌యంతి వేడుక‌ల‌ను ఏడాది పాటు నిర్వ‌హించేలా టీడీపీ ప్ర‌ణాళిక ర‌చించింది. శుక్ర‌వారం నుంచి ఒంగోలు కేంద్రంగా జ‌ర‌గ‌నున్న టీడీపీ మ‌హానాడులో శ‌నివారం ఎన్టీఆర్ శ‌త జ‌యంతి వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించనున్నారు.

ఈ సంద‌ర్భంగా తెలంగాణ‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీత‌క్క‌కు చెందిన ఓ ఫొటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన టీడీపీ అభిమాని ఒక‌రు విశ్వాసం అంటే ఇదేనంటూ కామెంట్ పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో ఎన్టీఆర్ చిత్ర‌ప‌టానికి సీత‌క్క ఓ చిన్నారితో క‌లిసి నివాళి అర్పిస్తున్నారు.

న‌క్స‌లిజాన్ని వదిలి జ‌న జీవ‌న స్ర‌వంతిలో క‌లిసిన త‌ర్వాత టీడీపీతోనే రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని ప్రారంభించిన సీత‌క్క‌... ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నా... అప్పుడప్పుడు ఆయా సంద‌ర్భాల‌ను బ‌ట్టి టీడీపీ అధినేత చంద్ర‌బాబును ఆమె క‌లుస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా త‌న‌కు రాజ‌కీయ జీవితాన్ని ప్ర‌సాదించిన టీడీపీపై ఇంకా విశ్వాసాన్ని క‌న‌బ‌రుస్తూనే ఉన్నార‌న్న కోణంలో ఆ నెటిజ‌న్ ఆమె ఫొటోను షేర్ చేశారు.