'ఎఫ్ 3'లో పవన్ కల్యాణ్.. క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు

26-05-2022 Thu 17:55
  • రేపు ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'ఎఫ్ 3'
  • సినిమాలో పవన్ కనిపించడం బిగ్ సర్ ప్రైజ్ అన్న దిల్ రాజు
  • ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని ధీమా
Pawan Kalyan will appear in F3 says Dil Raju
వెంకటేశ్, వరుణ్ తేజ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన 'ఎఫ్ 3' సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, పాటలు ప్రేక్షకులను అలరించాయి. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. 

మరోవైపు ప్రమోషన్లలో భాగంగా దిల్ రాజు ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కనిపించనున్నారని ఆయన తెలిపారు. సినీ అభిమానులకు ఇదొక బిగ్ సర్ ప్రైజ్ అని చెప్పారు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

అయితే స్క్రీన్ పై పవన్ కల్యాణ్ ఏ విధంగా కనిపించబోతున్నారనే విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు. దీంతో ఏదైనా సన్నివేశంలో పవన్ కనిపిస్తారా? లేక పాత చిత్రంలోని ఆయన సన్నివేశాన్ని ఇందులో చూపించారా? అనే సస్పెన్స్ నెలకొంది.