KCR: రెండు మూడు నెలల్లో సంచలన వార్తను చెపుతాను: కేసీఆర్

  • దేశంలో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయన్న కేసీఆర్ 
  • కచ్చితమైన మార్పు ఉండబోతోందని వ్యాఖ్య 
  • ఎందరో ప్రధానులు వచ్చారు.. దేశ పరిస్థితులు మాత్రం మారలేదన్న సీఎం  
Will tell a sensational news in two to three months says KCR

బెంగళూరుకు వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్ మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామిని కలిసిన సంగతి తెలిసిందే. సమావేశానంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయని ఆయన చెప్పారు. కచ్చితమైన మార్పు ఉంటుందని... దాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. రెండు, మూడు నెలల్లో తాను ఒక సంచలన వార్తను చెపుతానని తెలిపారు. దేవెగౌడ, కుమారస్వామితో దేశ, కర్ణాటక రాజకీయాలపై తాను చర్చించినట్టు చెప్పారు. 

మన దేశంలో ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయని, ఎందరో ప్రధానులు వచ్చారని... కానీ దేశ పరిస్థితులు మాత్రం బాగుపడలేదని కేసీఆర్ అన్నారు. మన కంటే వెనుకబడి ఉన్న చైనా 16 ట్రిలియన్ ఎకానమీగా ఎదిగిందని... మనం మాత్రం 5 ట్రిలియన్ డాలర్ల వద్దే ఉన్నామని చెప్పారు. దేశంలో మంచి నాయకులు, మంచి వాతావరణ పరిస్థితులు ఉన్నాయని... అయినప్పటికీ మనం ఇప్పటికీ తాగునీరు, సాగునీరు, కరెంట్ సమస్యలతో బాధపడుతున్నామని అన్నారు. మన దేశంలో ద్రవ్యోల్బణం రోజురోజుకు పెరుగుతోందని, జీడీపీ పడిపోయిందని చెప్పారు. కంపెనీలు మూత పడుతున్నాయని, రూపాయి విలువ దారుణంగా పడిపోయిందని అన్నారు.

More Telugu News