బెంగళూరులో కేసీఆర్ ను కలిసిన తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్, సభ్యులు

26-05-2022 Thu 17:02
  • బెంగళూరు పర్యటనకు వెళ్లిన కేసీఆర్
  • దేవెగౌడ, కుమారస్వామిలతో సమావేశం
  • లీలా ప్యాలెస్ లో సీఎం ను కలిసిన టీఎస్ బీసీ కమిషన్
TS BC Commission meets KCR in Bengaluru
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు బెంగళూరుకు వెళ్లిన సంగతి తెలిసిందే. మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో ఆయన సమావేశమయ్యారు. మరోవైపు బెంగళూరులో కేసీఆర్ ను తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్, సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. అధ్యయనంలో భాగంగా కర్ణాటకలో బీసీ కమిషన్ బృందం పర్యటిస్తోంది. బెంగళూరులోని లీలా ప్యాలెస్ లో వీరు సీఎంను కలిశారు. 

కేసీఆర్ ను కలిసిన వారిలో కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, సభ్యులు సీహెచ్ ఉపేంద్ర, శుభప్రద్ పటేల్ సూలి, కిశోర్ గౌడ్ ఉన్నారు. ఈ సందర్భంగా తమ అధ్యయనం వివరాలను సీఎంకు తెలిపారు. మరో రెండు రోజులు ఇక్కడే ఉండి ప్రభుత్వ అధికారులు, న్యాయ నిపుణులు, సామాజికవేత్తలను కలవనున్నట్టు సీఎంకు వీరు తెలిపారు.