BMW i4 e sedan: బీఎండబ్ల్యూ నుంచి ఐ4 ఎలక్ట్రిక్ కారు.. ధర రూ.69.90 లక్షలు

BMW i4 e sedan launched at 69 lakh promises 590 km on a single charge
  • రెండు వేరియంట్లలో విడుదల
  • ఒక్కసారి చార్జింగ్ తో 590 కిలోమీటర్ల ప్రయాణం
  • 5 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగం
కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో పర్యావరణానికి అనుకూలమైన ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. దీంతో ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీలు ఒక్కొక్కటిగా ఎలక్ట్రిక్ వాహనాలతో ఎంట్రీ ఇస్తున్నాయి. ప్రముఖ లగ్జరీ కార్ల బ్రాండ్ బీఎండబ్ల్యూ పూర్తి ఎలక్ట్రిక్ కారు ‘ఐ4 సెడాన్’ను భారత మార్కెట్లోకి గురువారం విడుదల చేసింది. ధీని ధర ఢిల్లీ ఎక్స్ షోరూమ్ రూ.69.90 లక్షలు. 

ఐఎక్స్ పేరుతో గతేడాది ఎలక్ట్రిక్ కారును విడుదల చేసిన తర్వాత ఈ సంస్థ తీసుకొచ్చిన రెండో మోడల్ ఇది. ఈ డ్రైవ్ 40, ఎం 50 ఎక్స్ డ్రైవ్ అనే రెండు వేరియంట్లను ప్రవేశపెట్టింది. ఇది అచ్చం బీఎండబ్ల్యూ 4-సిరీస్ గ్రాన్ కూప్ మాదిరిగా ఉంటుంది. గ్రాన్ క్రూప్ ను పూర్తి ఎలక్ట్రిక్ కారుగా మార్చినట్టు అనిపిస్తుంది. 

83.9 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ తో ఇది పనిచేస్తుంది. ఇందులో ఈడ్రైవ్ 40 ఒక్కసారి చార్జింగ్ చేస్తే 521 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని 5.7 సెకన్లలోనే అందుకోవచ్చని సంస్థ తెలిపింది. ఎం50 ఎక్స్ డ్రైవ్ ఏడబ్ల్యూడీ స్పోర్టీగా ఉంటుంది. రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఒక్కసారి చార్జ్ చేస్తే 590 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. 

BMW i4 e sedan
launched
pure electric car

More Telugu News