patient: కేన్సర్ ను అంతం చేసే ఇంజెక్షన్.. రోగిపై మొదటిసారి ప్రయోగం

  • కేన్సర్ కణాలను గుర్తించేందుకు జన్యుపరంగా మార్పు
  • కేన్సర్ కణాలపై దాడికి వీలుగా వ్యాధి నిరోధక శక్తికి ప్రేరణ
  • యూఎస్ లోని సిటీ ఆఫ్ హోప్ లో ప్రయోగాలు
First human patient injected with cancer killing virus in new clinical trial

కేన్సర్ మహమ్మారిపై పోరులో భాగంగా శాస్త్రవేత్తలు సరికొత్త ఆవిష్కరణకు తెరతీశారు. కేన్సర్ ను అంతం చేసే వైరస్ ను ఇంజెక్షన్ ద్వారా కేన్సర్ రోగిలోకి ప్రవేశపెట్టారు. వ్యాక్సీనియా అనే ఈ వైరస్ ను అమెరికాలో ఓ సంస్థ అభివృద్ధి చేసింది. జంతువులపై ప్రయోగాత్మకంగా పరీక్షించి చూడగా విజయం సాధించారు.  

ఈ వైరస్ కొలన్, లంగ్, బ్రెస్ట్, ఒవేరియన్, పాంక్రియాటిక్ కేన్సర్ ట్యూమర్లను తగ్గిస్తున్నట్టు ప్రీ క్లినికల్ లేబరేటరీ, జంతువులపై పరీక్షల్లో వెల్లడైంది. ఈ విషయాన్ని అమెరికాలో అతిపెద్ద కేన్సర్ పరిశోధన, చికిత్సా సంస్థ ‘సిటీ ఆఫ్ హోప్’ ప్రకటించింది. "మా గత పరిశోధనలో.. ఆంకోలైటిక్ వైరస్ లు కేన్సర్ ను అంతం చేసేందుకు వీలుగా వ్యాధి నిరోధక శక్తిని ప్రేరేపిస్తున్నట్టు గుర్తించడం జరిగింది’’ అని సిటీ ఆఫ్ హోప్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డానెంగ్ లీ తెలిపారు. కేన్సర్ తో పోరాటం చేస్తున్న వారికి వ్యాక్సీనియా మంచి ఫలితం ఇస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు. 

ప్రయోగాత్మక చికిత్సలో భాగంగా వ్యాక్సీనియా ఇంజెక్షన్ ను తక్కువ మోతాదులో నేరుగా కేన్సర్ ట్యూమర్లుకు లేదా నరాలకు ఇవ్వనున్నట్టు సిటీ ఆఫ్ హోప్ తెలిపింది. వ్యాక్సీనియా అని పిలిచే దీనికి సీఎఫ్ 33- హెచ్ఎన్ఐఎస్ అని కూడా పేరు. ఇది ఆంకోలైటిక్ వైరస్. శరీరంలో ఆరోగ్యకరమైన కణాలు, కేన్సర్ కణాలు ఉంటాయి. కేన్సర్ కణాలను గుర్తించి అంతం చేసే విధంగా జన్యుపరంగా మార్పు చేసిన వైరస్ ఇది. 

ఈ వైరస్ కణాల్లోకి ప్రవేశించిన తర్వాత తనకు తాను భారీ సంఖ్యలో కొత్త వైరస్ కణాలను తయారు చేసుకుంటుంది. ఇవి యాంటీజెన్ గా పనిచేస్తాయి. ఇవి వ్యాధి నిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తాయి. దాంతో సమీపంలోని కేన్సర్ కణాలపై దాడి జరుగుతుంది.

More Telugu News