janvi Kapoor: జాన్వీకపూర్ ను ఒప్పించే ప్రయత్నంలో కొరటాల!

Koratala and Ntr Combo Update
  • ఎన్టీఆర్ సినిమా పనుల్లో కొరటాల
  • రానున్న రెండు నెలల్లో మొదలుకానున్న రెగ్యులర్ షూటింగ్
  • జాన్వీ కపూర్ తో జరుపుతున్న సంప్రదింపులు
  • త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్  
ఎన్టీఆర్ తో సినిమాకి కొరటాల రెడీ అవుతున్నారు. రానున్న రెండు నెలలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలవుతుందని చెబుతున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'జనతా గ్యారేజ్' భారీ విజయాన్ని  సాధించడంతో, సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. 
 
కల్యాణ్ రామ్ .. మిక్కిలినేని సుధాకర్ నిర్మించే ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా అనిరుధ్ ను తీసుకున్నారు. ఈ సినిమాలో కథానాయికగా జాన్వీ కపూర్ ను తీసుకోవాలనే ఆలోచనలో కొరటాల ఉన్నారట. తమ సినిమాతోనే ఆమె టాలీవుడ్ కి పరిచయం కావాలనే ఉద్దేశంతో ఆయన గట్టిగానే ట్రై చేస్తున్నాడని అంటున్నారు.

పెద్ద బ్యానర్ .. స్టార్ కాంబినేషన్ .. కథ నచ్చితే జాన్వీ కపూర్ తెలుగులో చేయడానికి సిద్ధంగా ఉందని ఆ మధ్య బోనీ కపూర్ చెప్పారు. దాంతో ఆమెను ఒప్పించడానికి కొరటాల అన్ని వైపులా నుంచి ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. జాన్వీ ఓకే అంటే ఈ ప్రాజెక్టుపై క్రేజ్ ఏ రేంజ్ లో పెరిగిపోతుందనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 
janvi Kapoor
Junior NTR
Koratala Siva

More Telugu News