Goa: ఇంటిని మొత్తం దోచేసి.. ‘ఐ లవ్యూ’ అని రాసి వెళ్లిపోయిన దొంగ!

I Love You Note Left Behind After Rs 20 Lakh Robbery In Goa
  • పర్యాటక ప్రదేశం గోవాలో ఘటన
  • రూ. 20 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, రూ. 1.5 లక్షల నగదు చోరీ
  • టీవీ స్క్రీన్‌పై ఐలవ్యూ అని రాసి వెళ్లిన దొంగ
ప్రముఖ పర్యాటక ప్రదేశమైన గోవాలో జరిగిన ఓ చోరీ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఓ బంగళాలోకి చొరబడిన దొంగ అందినకాడికి దోచుకుని ‘ఐ లవ్యూ’ అని రాసి మరీ వెళ్లాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గోవాకు చెందిన ఆసిబ్ జెక్ హాలీడేకు వెళ్లి రెండు రోజుల తర్వాత మంగళవారం ఇంటికి చేరుకున్నారు. ఇంట్లోకి వచ్చాక లోపల గదులు చిందరవందరగా ఉండడంతో అనుమానం వచ్చిన ఆయన ఇంటిని పరిశీలించి చూసి విస్తుపోయాడు.

ఇంట్లో ఉండాల్సిన రూ. 20 లక్షల విలువైన బంగారం, వెండి నగలతోపాటు రూ. 1.5 లక్షల నగదు చోరీకి గురైనట్టు గుర్తించి లబోదిబోమన్నాడు. అంతేకాదు, ఇంట్లోని టీవీ స్క్రీన్‌పై ‘ఐ లవ్యూ’ అని రాసి ఉండడాన్ని చూసి షాకయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Goa
Robbery
I Love You
Crime News

More Telugu News