తెలంగాణలో ఉన్న మసీదులన్నింటిని తవ్వాలి.. శవం వస్తే మీది.. శివలింగం వస్తే మాది: బండి సంజయ్

25-05-2022 Wed 21:58
  • జ్ఞానవాపి మసీదులో శివలింగం బయటపడిందన్న సంజయ్ 
  • తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే మదర్సాలను మూసేస్తామని వ్యాఖ్య 
  • మైనార్టీ రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న సంజయ్  
Bandi Sanjay demands to excavate all masjids in Telangana
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఇప్పటి వరకు ఉత్తరాదికే పరిమితమైన మందిర్-మసీదు వివాదాన్ని ఆయన తెలంగాణకు తీసుకొచ్చారు. ఈరోజు హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... తెలంగాణలో ఉన్న మసీదులన్నింటినీ తవ్వాలని... తవ్వకాల్లో శవం వస్తే ఆ మసీదును మీకే వదిలేస్తామని, శివలింగం వస్తే మేము తీసుకుంటామని అన్నారు. 

ఉత్తరప్రదేశ్ లోని వారణాసి జ్ఞానవాపి మసీదులో శివలింగం బయటపడిందని బండి సంజయ్ చెప్పారు. ఇక్కడున్న మసీదులను తవ్వినా శివలింగాలు వస్తాయని అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని మదర్సాలను మూసేస్తామని తెలిపారు. మైనార్టీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పారు. రాష్ట్రానికి పట్టిన శనిని వదిలిస్తామని, రామరాజ్యాన్ని స్థాపిస్తామని అన్నారు.