దావోస్‌లో కేటీఆర్‌తో సీరం అధినేత పూనావాలా భేటీ

25-05-2022 Wed 21:44
  • దావోస్ స‌ద‌స్సులో బిజీబిజీగా తెలంగాణ పెవిలియ‌న్‌
  • ఇప్ప‌టికే పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు సాధించిన తెలంగాణ బృందం
  • కేటీఆర్‌తో భేటీ అయిన అధ‌ర్ పూనావాలా
  • తెలంగాణ‌లో వ్యాక్సిన్ త‌యారీ అవ‌కాశాల‌పై చ‌ర్చ‌
SerumInstituteIndia ceo Adar Poonawalla met ktr in davos
దావోస్ వేదిక‌గా జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ ఎక‌న‌మిక్ ఫోరంలో తెలంగాణ పెవిలియ‌న్‌కు పెద్ద సంఖ్య‌లో వ్యాపార‌వేత్త‌లు వ‌స్తున్నారు. ఇప్ప‌టికే ప‌లు కీల‌క సంస్థ‌ల‌తో తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్టే దిశ‌గా ఒప్పించిన తెలంగాణ ప‌రిశ్ర‌మలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో ప్ర‌పంచంలోనే వ్యాక్సిన్ దిగ్గ‌జ కంపెనీగా అవ‌త‌రించిన సీరం ఇన్‌స్టిట్యూట్ సీఈఓ అధ‌ర్ పూనావాలా భేటీ అయ్యారు. 

ఈ సంద‌ర్భంగా వ్యాక్సిన్ త‌యారీ, ప‌రిశోధ‌న‌ల‌కు సంబంధించి తెలంగాణ‌లో ఉన్న అవ‌కాశాల‌పై ఆయ‌న కేటీఆర్‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. అయితే ఈ భేటీలో తెలంగాణ‌లో సీరం పెట్టుబ‌డుల అంశానికి సంబంధించి స్ప‌ష్ట‌త రాలేదు.