Ranga Reddy District: బావను చంపేందుకు కత్తితో కోర్టుకు వచ్చిన బావమరిది!

Man came to court with knife to kill his brother in law
  • ప్రియుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సాయికిరణ్ సోదరి
  • ఆమెను మోసం చేసిన భర్త
  • కోర్టులో కొనసాగుతున్న కేసు విచారణ
తన సోదరిని మోసం చేసిన వ్యక్తిని చంపేందుకు కత్తితో పాటు కోర్టుకు వచ్చి అలజడి సృష్టించాడు ఒక వ్యక్తి. ఈ ఘటన హైదరాబాద్ లోని రంగారెడ్డి జిల్లా కోర్టులో ఈ రోజు కలకలం రేపింది. సాయికిరణ్ అనే యువకుడు కత్తితో కోర్టులోకి ప్రవేశించాడు. ఆ సమయంలో అతని వెంట ఒక స్నేహితుడు కూడా ఉన్నాడు. సాయికిరణ్ చేతిలో కత్తి ఉండటాన్ని గమనించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.    

వివరాల్లోకి వెళ్తే సాయికిరణ్ సోదరిని ఓ వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే కొన్ని రోజులకే ఆమెను మోసం చేశాడు. దీనికి సంబంధించిన కేసు విచారణ కోర్టులో ఉంది. విచారణ కోసం అతను కోర్టుకు వచ్చాడు. విషయం తెలుసుకున్న సాయికిరణ్ అతనిని చంపేందుకు కోర్టుకు చేరుకున్నాడు. అప్రమత్తమైన పోలీసులు సాయికిరణ్ ను అదుపులోకి తీసుకున్నారు.
Ranga Reddy District
Court
Knife
Man

More Telugu News