చిరంజీవి ఆ ప్రాజెక్టుపై అంతగా ఇంట్రెస్ట్ చూపడం లేదట!

25-05-2022 Wed 19:35
  • ముగింపు దశలో 'గాడ్ ఫాదర్'
  • లైన్లో బాబీ .. మెహర్ రమేశ్
  • మెగాస్టార్ ను మెప్పించే పనిలో వెంకీ కుడుముల
  • ఈ ప్రాజెక్టు విషయంలో త్వరలోనే రానున్న  క్లారిటీ
Venky Kudumula movie update
'ఆచార్య' సినిమాపై చిరంజీవి ఎంతో నమ్మకం పెట్టుకుంటే దాని ఫలితం నిరాశ పరిచింది. దాంతో ఆయన ఆ తరువాత చేయనున్న సినిమాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఒకసారి అన్ని స్క్రిప్టులను అన్ని వైపులా నుంచి చెక్ చేసుకోవాలని మరీ చెప్పారట. 

దాంతో ఎవరి ప్రాజెక్టుపై వాళ్లు ప్రత్యేకమైన దృష్టిని పెట్టినట్టుగా చెబుతున్నారు. ఈ వరుసలో ముందుగా మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత 'వాల్తేరు వీరయ్య' .. 'భోళా శంకర్' సినిమాలు రానున్నాయి. ఆ తరువాత లైన్లో వెంకీ కుడుముల ఉన్నాడు ..  పూర్తి స్క్రిప్ట్ పై గట్టిగానే కసరత్తు చేశాడు. 

అయితే లైన్ చెప్పినప్పుడు ఓకే చెప్పిన చిరూ, స్క్రిప్ట్ విషయంలో సంతృప్తికరంగా లేనట్టు సమాచారం. చిరంజీవి స్టయిల్ ను పట్టుకోవడం వెంకీ కుడుములకు కష్టమవుతోందని అంటున్నారు. కొరటాల విషయంలోను అక్కడే తేడా కొట్టింది. మరి వెంకీ కుడుముల మెగాస్టార్ ను మెప్పించగలుగుతాడేమో చూడాలి.