లైఫ్ లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు .. 'థ్యాంక్యూ' టీజర్ రిలీజ్!

25-05-2022 Wed 18:24
  • విక్రమ్ కుమార్ తాజా చిత్రంగా రూపొందిన 'థ్యాంక్యూ'
  • డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తున్న చైతూ
  • ఆయన సరసన నాయికలుగా రాశి ఖన్నా .. అవికా .. మాళవిక 
  • జులై 8వ తేదీన విడుదల కానున్న సినిమా
Thank you movie update
నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ' సినిమా రూపొందింది. విభిన్నమైన ప్రేమకథా చిత్రం ఇది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా, ఇండియాలోను .. విదేశాల్లోను షూటింగును జరుపుకుంది. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ ను రిలీజ్ చేశారు.

ఈ కథలో చైతూ జర్నీని చూపించారు. టీనేజ్ లోను .. ఆ తరువాత .. విదేశాలకి వెళ్లిన తరువాత ఆయనకు ఎదురైన అనుభవాల నేపథ్యంలో ఈ కథ నడవనున్నట్టు తెలుస్తోంది. ఒక్కో దశలో ఒక్కో హీరోయిన్ తో ఆయన ప్రయాణం కొనసాగుతుందనే విషయాన్ని చూపించారు. ఆ జాబితాలో రాశి ఖన్నా .. అవికా .. మాళవిక నాయర్ కనిపిస్తున్నారు 

'లైఫ్  లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు .. ఎన్నో వదులుకుని ఇక్కడికి వచ్చాను' అనే చైతూ డైలాగ్ ను బట్టి చూస్తే, సీరియస్ గా ఆయనకి ఏదో గోల్ ఉన్నట్టుగా అర్థమవుతోంది. లవ్ .. రొమాన్స్ .. ఎమోషన్ .. యాక్షన్ కి సంబంధించిన సీన్స్ పై కట్ చేసిన టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రకాశ్ రాజ్ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాను, జూలై 8వ తేదీన విడుదల చేయనున్నారు.