ప్ర‌భుత్వ వైఖ‌రే కోన‌సీమ అల్ల‌ర్లకు కార‌ణం: సీపీఐ నారాయ‌ణ‌

25-05-2022 Wed 17:30
  • కొత్త జిల్లాల ఏర్పాట‌ప్పుడే అంబేద్క‌ర్ పేరు పెట్టి ఉంటే స‌రిపోయేదన్న నారాయణ 
  • జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త వల్లే కోన‌సీమ‌లో అల్ల‌ర్లని వ్యాఖ్య 
  • ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవాల‌న్న నారాయ‌ణ‌
cpi narayana derogatory comments on qmalapuram clashes
కోన‌సీమ జిల్లా కేంద్రం అమ‌లాపురంలో మంగ‌ళ‌వారం చోటుచేసుకున్న అల్ల‌ర్ల‌పై సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ స్పందించారు. ప్ర‌భుత్వ వైఖ‌రే కోన‌సీమ అల్ల‌ర్ల‌కు కార‌ణ‌మ‌ని ఆయ‌న అన్నారు. ఇప్ప‌టికైనా వైసీపీ స‌ర్కారు త‌న నిర్ణ‌యాల‌పై పున‌రాలోచ‌న చేయాల‌ని ఆయ‌న కోరారు. 

కోన‌సీమ జిల్లాకు అంబేద్క‌ర్ పేరును కొత్త జిల్లాల ఏర్పాటు సంద‌ర్భంగానే పెట్టి ఉంటే స‌రిపోయేద‌ని నారాయ‌ణ అభిప్రాయ‌ప‌డ్డారు. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవాల‌ని ఆయ‌న సూచించారు. జ‌గ‌న్ ప్రభుత్వంపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త కార‌ణంగానే కోన‌సీమలో అల్ల‌ర్లు చెల‌రేగాయ‌ని కూడా నారాయ‌ణ ఆరోపించారు.