Sensex: మార్కెట్లకు వరుసగా మూడో రోజు కూడా నష్టాలే!

  • అమ్మకాల ఒత్తిడికి గురైన మార్కెట్లు
  • 303 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 99 పాయింట్లు పతనమైన నిఫ్టీ
Markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం లాభాల్లోనే ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఐటీ స్టాకులు భారీ నష్టాలను నమోదు చేశాయి. అమ్మకాల ఒత్తిడి మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 303 పాయింట్లు నష్టపోయి 53,749కి పడిపోయింది. నిఫ్టీ 99 పాయింట్లు కోల్పోయి 16,025కి దిగజారింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (3.84%), కోటక్ బ్యాంక్ (1.42%), భారతి ఎయిర్ టెల్ (1.41%), హెచ్డీఎఫ్సీ (1.35%), నెస్లే ఇండియా (1.02%). 

టాప్ లూజర్స్:
ఏసియన్ పెయింట్స్ (-8.04%), టీసీఎస్ (-3.69%), టెక్ మహీంద్రా (-3.53%), విప్రో (-3.30%), ఎల్ అండ్ టీ (-3.09%).

More Telugu News