monkeypox: మంకీ పాక్స్ వైరస్ కు వ్యాక్సిన్ ఎప్పుడు...?

  • ఇప్పటి వరకు ఈ వైరస్ కు టీకా లేదు
  • ఆఫ్రికా దేశాల్లో ఏటా వేలాది కేసులు
  • మొదటిసారి ప్రపంచవ్యాప్తంగా విస్తరణ
  • నివారణ చర్యలపై ప్రభుత్వాల దృష్టి
Do we have a vaccine for monkeypox being reported globally

మంకీ పాక్స్ కేసులు ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తుండడం ఆందోళనకు గురి చేస్తోంది. ఒమిక్రాన్ మాదిరిగా వేగంగా వ్యాప్తి చెందే వైరస్ కాదిది. అయినా కానీ, ఇప్పటికే 12కు పైగా దేశాలకు పాకిపోయింది. అందులో అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్, యూఏఈ కూడా ఉన్నాయి. పశ్చిమ ఆఫ్రికాలో పర్యటించి వచ్చిన ఒక మహిళలో వైరస్ గుర్తించినట్టు యూఏఈ ప్రకటించింది. కోతుల నుంచి ఈ వైరస్ వస్తుంది కనుక మంకీ పాక్స్ గా దీనికి పేరు. 

ఒళ్లు నొప్పులు, చలి, అలసట, జ్వరం వైరస్ సోకిన వారిలో ఎక్కువగా కనిపిస్తాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటే చర్మంపై మచ్చలు ఏర్పడతాయి.మంకీ పాక్స్ కేసుల్లో 6 శాతం వరకు మరణాలు ఉండొచ్చని ఒక అంచనా. పిల్లల్లోనే ఎక్కువ ప్రమాదం. మంకీ పాక్స్ కు చికిత్స ఉందా..? కరోనా మాదిరి కాకుండా ముందు నుంచీ ఉన్నదే మంకీ పాక్స్. కనుక దీనిని చికిత్సతో నయం చేయవచ్చు. వైద్యులను సంప్రదించకుండా నిర్లక్ష్యం చేయకూడదు. రెండు నుంచి నాలుగు వారాల్లో చాలా వరకు రోగులు పూర్తిగా కోలుకుంటారని వైద్యులు చెబుతున్నారు.

మంకీ పాక్స్ కు ఇంత వరకు టీకాలను కనుక్కోలేదు. ఎందుకంటే మంకీ పాక్స్ వైరస్ ఎప్పటి నుంచో ఉన్నా.. కేసులు భారీగా పెరిగిపోవడం ఎప్పుడూ చూడలేదు. అందుకే టీకాలపై కంపెనీలు దృష్టి పెట్టలేదు. స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్ తరహా టీకాలు అయితే పిల్లలకు అందుబాటులో ఉన్నాయి. మంకీ పాక్స్ కేసులు భారీగా వస్తుంటే అప్పుడు కంపెనీలు టీకాల అభివృద్ధిపై దృష్టి సారించే అవకాశం ఉంటుంది. 

ఏటా మంకీ పాక్స్ వైరస్ కేసులు ఆఫ్రికా దేశాల్లో వేల సంఖ్యలో నమోదవుతూ ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది. ముఖ్యంగా కాంగోలో ఏటా 6,000 కేసులు వస్తుంటాయని సమాచారం. ఒక టీకా అభివృద్ది కోసం కంపెనీలు రూ.వందల కోట్లను ఖర్చు చేయాల్సి వస్తుంది. పెట్టుబడికి మించి రాబడినిచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తేనే టీకాల తయారీకి ముందుకు వస్తాయి. 

More Telugu News