Rashid Khan: నాలుగు రోజుల బ్రేక్.. నిద్ర పోవడమే: రషీద్ ఖాన్ సరదా రిప్లై

Rashid Khans cheeky reply to Gujarat Titans tweet looking for things to do during 4 day break
  • ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న గుజరాత్ టైటాన్స్
  • 29న ఐపీఎల్ ఫైనల్స్ మ్యాచ్
  • అప్పటి వరకు ఏం చేయాలని అడిగిన గుజరాత్ టైటాన్స్ 
గుజరాత్ టైటాన్స్ జట్టుకు నాలుగు రోజుల విరామం లభించింది. క్వాలిఫయర్ మ్యాచ్ లో రాజస్థాన్ ను ఓడించడంతో ఫైనల్ కు దూసుకుపోయింది. ఆదివారం ఫైనల్స్ లో ప్రత్యర్థిని డీకొట్టనుంది. అప్పటి వరకు మరో నాలుగు రోజుల సమయం ఉంది. ఈ నాలుగు రోజుల వ్యవధిలో ఏం చేయాలి? సూచనలు ఇవ్వాలంటూ గుజరాత్ టైటాన్స్ ట్విట్టర్ హ్యాండిల్ లో అడగ్గా.. యూజర్లు రకరకాలుగా స్పందించారు.

ఏమేమి చేయవచ్చో కొందరు నెటిజన్లు సూచించారు. గుజరాత్ టైటాన్స్ జట్టు వైస్ కెప్టెన్, అప్ఘానిస్థాన్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ భిన్నంగా స్పందించాడు. 'నిద్రపో..' అంటూ నవ్వుతున్న మూడు ఎమోజీలను పోస్ట్ చేశాడు. కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ లో రషీద్ కీలకంగా వ్యవహరిస్తుండడం తెలిసిందే. హార్ధిక్ పాండ్యా ఒక మ్యాచ్ కు దూరంగా ఉన్నా, కెప్టెన్ గా రషీద్ ఖాన్ రాణించి విజయాన్ని తెచ్చాడు. బ్యాటింగ్, బౌలింగ్ లోనూ అతడు రాణిస్తున్నాడు.
Rashid Khan
Gujarat Titans
IPL fianls

More Telugu News