USA: అమెరికాలో 18 ఏళ్ల యువకుడి కాల్పులు.. 18 మంది చిన్నారుల సహా 21 మంది మృత్యువాత

  • మెక్సికన్ సరిహద్దులో ఘటన
  • హ్యాండ్‌గన్‌తో పాఠశాలలోకి ప్రవేశించిన యువకుడు
  • పోలీసుల కాల్పుల్లో దుండగుడి హతం
  • 2018 తర్వాత అత్యంత ఘోరమైన ఘటన ఇదే
Teenage gunman kills 18 children at Texas elementary school

అమెరికాలోని టెక్సాస్‌లో తుపాకి మరోమారు నిప్పులు కక్కింది. ఓ ప్రాథమిక పాఠశాలలోకి చొరబడిన 18 ఏళ్ల యువకుడు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 18 మంది చిన్నారులు, ఓ టీచర్ కూడా ఉన్నారు. మెక్సికన్ సరిహద్దులోని ఉవాల్డే పట్టణంలోని రోబ్ ఎలిమెంటరీ స్కూల్‌లో జరిగిన ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులందరూ 11 ఏళ్లలోపు వారేనని అధికారులు తెలిపారు. 

దుండగుడు కాల్పులు జరిపిన పాఠశాలలో 500 మంది కంటే ఎక్కువమందే చదువుకుంటున్నట్టు టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ తెలిపారు. దుండగుడు హ్యాండ్‌గన్‌తో పాఠశాలలోకి చొరబడ్డాడని, అతడి వద్ద రైఫిల్ కూడా ఉండి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసుల కాల్పుల్లో నిందితుడు హతమయ్యాడని గవర్నర్ తెలిపారు.

కాగా, అమెరికాలో 2018 తర్వాత జరిగిన అత్యంత ఘోరమైన ఘటన ఇదేనని అధికారులు తెలిపారు. ఫ్లోరిడాలోని పార్క్‌ల్యాండ్‌లో అప్పట్లో జరిగిన కాల్పుల్లో 14 మంది హైస్కూల్ విద్యార్థులు సహా ముగ్గురు టీచర్లు మృతి చెందారు. 2020లో అమెరికాలో జరిగిన కాల్పుల ఘటనల్లో 19,350 మంది ప్రాణాలు కోల్పోయారు.

More Telugu News