Lizard: కూల్ డ్రింకులో చచ్చిన బల్లి... మెక్ డొనాల్డ్స్ అవుట్ లెట్ మూసివేత

Dead lizard spotted in Cool Drink at a McDonalds outlet in Ahmedabad
  • అహ్మదాబాద్ లో ఘటన
  • కూల్ డ్రింకులో బల్లి కనిపించడంతో కస్టమర్ దిగ్భ్రాంతి
  • అధికారులను ట్యాగ్ చేస్తూ వీడియో పోస్టు
  • స్పందించిన మున్సిపల్ అధికారులు
  • రెస్టారెంటులో తనిఖీలు
అహ్మదాబాద్ లోని మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్ పై మున్సిపల్ అధికారులు కొరడా ఝుళిపించారు. ఇద్దరు వ్యక్తులు మెక్ డొనాల్డ్స్ అవుట్ లెట్లో కోక్ తాగుతుండగా, అందులో భార్గవ జోషి అనే వ్యక్తి తాగుతున్న కూల్ డ్రింకులో చచ్చిన బల్లి దర్శనమిచ్చింది. దీనిని వీడియో తీసిన భార్గవ జోషి పోలీసులకు, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ) అధికారులకు ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. 

కూల్ డ్రింకులో చచ్చిన బల్లి పడివున్న విషయాన్ని మెక్ డొనాల్డ్స్ అవుట్ లెట్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లగా, ఆ విషయానికి అంత ప్రాధాన్యం ఇవ్వలేదని భార్గవ ఆరోపించాడు. అంతేకాదు, కూల్ డ్రింకుకు చెల్లించిన డబ్బును తిరిగి ఇస్తామని చెప్పాడని వెల్లడించాడు. 

కాగా, కూల్ డ్రింకులో బల్లి పడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో అహ్మదాబాద్ పురపాలక శాఖ స్పందించింది. మెక్ డొనాల్డ్స్ అవుట్ లెట్ లో తనిఖీలు చేపట్టింది. ఆపై రెస్టారెంటును మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. కూల్ డ్రింకు శాంపిల్స్ ను పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీకి పంపించారు.
Lizard
Cool Drink
Coke
McDonald's
Ahmedabad

More Telugu News