Undavalli Arun Kumar: ఏపీలో బీజేపీ, జనసేన విడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు: ఉండవల్లి

Undavalli opines on alliance between AP political parties
  • ఏపీలో ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం
  • ఆసక్తికరంగా పొత్తుల విషయం
  • టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉండొచ్చన్న ఉండవల్లి 
  • ముక్కోణపు పోరు ఉండదని భావిస్తున్నానని వ్యాఖ్య 
ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగా, పొత్తుల గురించిన అంశాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. దీనిపై సీనియర్ రాజకీయవేత్త, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. వచ్చే ఎన్నికల నాటికి ఏదైనా జరగొచ్చని అభిప్రాయపడ్డారు. ఏపీలో బీజేపీ, జనసేన విడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నారు. అదే సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాటలు చూస్తుంటే టీడీపీ, జనసేన మళ్లీ కలుస్తాయని భావిస్తున్నట్టు తెలిపారు. 

ఏదేమైనా ఏపీలో వచ్చే ఎన్నికల్లో ముక్కోణపు పోరు ఉండదని భావిస్తున్నానని ఉండవల్లి పేర్కొన్నారు. ఏపీలో సీఎం జగనే కొనసాగాలని బీజేపీ భావిస్తే పొత్తులు ఉండకపోవచ్చని, ఏపీలో రాజకీయం ఎలా ఉంటే మనకేంటని బీజేపీ భావిస్తే మాత్రం పొత్తులు ఉంటాయని వివరించారు.
Undavalli Arun Kumar
Alliance
TDP
Janasena
BJP
Andhra Pradesh

More Telugu News