Somu Veerraju: రాష్ట్రాన్ని బుద్ధి లేని నాయకత్వం పాలిస్తోంది: సోము వీర్రాజు

Foolish govt is ruling AP says Somu Veerraju
  • ఇసుక, చెరువులోని మట్టి కూడా అమ్ముకుంటున్నారన్న వీర్రాజు 
  • కొందరు నేతలు పాదయాత్రలు చేసి రోడ్లు అరిగిపోయేలా చేశారంటూ ఎద్దేవా 
  • జగన్ సొంత జిల్లా కడపలో కూడా నిర్వాసితులు ఉన్నారని వ్యాఖ్య 
వైసీపీ ప్రభుత్వంపై ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. తోలు మందం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇసుక, చెరువులో మట్టిని కూడా అమ్ముకుని సంపాదించుకుంటోందని అన్నారు. రాష్ట్రాన్ని బుద్ధి లేని నాయకత్వం పాలిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో కొందరు నేతలు పాదయాత్రలు చేసి రోడ్లన్నీ అరిగిపోయేలా చేశారని ఎద్దేవా చేశారు. 

విజయనగరం జిల్లా వంగర మండలం మడ్డువలస నిర్వాసితుల గ్రామాల్లో ఈరోజు ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడపలో కూడా ప్రాజెక్టు నిర్వాసితులు ఉన్నారని చెప్పారు. మడ్డువలస రిజర్వాయర్ నిర్వాసితులతో పాటు అన్ని నిర్వాసిత గ్రామాలను తాము అభివృద్ధి చేస్తామని తెలిపారు.
Somu Veerraju
BJP
Jagan
YSRCP

More Telugu News