మనసు మార్చుకున్న పవన్ కల్యాణ్!

  • 'వీరమల్లు' షూటింగులో పవన్ కల్యాణ్ 
  • ఆ తరువాత చేయవలసిన సినిమా హరీశ్ శంకర్ తో 
  • ముందుగా సముద్రఖని ప్రాజెక్టు పూర్తి చేసే ఆలోచనలో పవన్
  • ఆ దిశగానే జరుగుతున్న సన్నాహాలు  
Pavan in Samudrakhani Movie

పవన్ కల్యాణ్ .. క్రిష్ కాంబినేషన్లో ' హరిహర వీరమల్లు' సినిమా రూపొందుతోంది. ఎ.ఎమ్. రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాకి, కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నారు. ఈ సినిమాలో భారీ సెట్స్ కోసం పెద్దమొత్తంలో ఖర్చు చేస్తున్నారు. చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో, కథానాయికగా నిధి అగర్వాల్ అలరించనుంది.

ఈ సినిమా తరువాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ 'భవదీయుడు భగత్ సింగ్' చేయనున్నాడు. ఈ సినిమాలో పవన్ ప్రొఫెసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా పూజ హెగ్డే సందడి చేయనుంది. అయితే ఈ సినిమా కంటే ముందుగా తమిళ మూవీ 'వినోదయా సితం' రీమేక్ ను పూర్తి చేయాలనే నిర్ణయానికి పవన్ వచ్చినట్టుగా చెబుతున్నారు.

తమిళ సినిమాకి దర్శకత్వం వహించిన సముద్రఖనియే తెలుగు రీమేక్ కి దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం. ఈ సినిమా కోసం పవన్ 40 రోజులను కేటాయించారట. ఆ లోగా ఆయన పోర్షన్ ను పూర్తిచేయవలసి ఉంటుంది. తమిళంలో చిన్న సినిమాగా వచ్చి .. పెద్ద హిట్ కొట్టిన ఈ సినిమా తెలుగులో ఎలాంటి రిజల్టును రాబడుతుందో చూడాలి.    

More Telugu News