Margani Bharat: జగన్ ని తిడుతూ.. ప్రభుత్వాన్ని అంటున్నానని అతితెలివి ప్రదర్శిస్తున్నారు: రఘురామకృష్ణరాజుపై వైసీపీ ఎంపీ ఫైర్

Margani Bharat fires on Raghu Rama Krishna Raju
  • రఘురాజుపై అనర్హత వేటు వేయాలని రెండేళ్లుగా కోరుతున్నామన్న మార్గాని భరత్ 
  • లోక్ సభ స్పీకర్ నుంచి సరైన స్పందన లేదని విమర్శ 
  • మోదీని బీజేపీ సభ్యులెవరైనా విమర్శిస్తే ఇలాగే ఉంటారా? అంటూ ప్రశ్న 

వైసీపీ ఎంపీగా కొనసాగుతూనే ఆ పార్టీపై, పార్టీ అధ్యక్షుడు జగన్ పై విమర్శలు గుప్పిస్తూ రఘురామకృష్ణరాజు ప్రతిరోజు వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజుపై వైసీపీ మరో ఎంపీ మార్గాని భరత్ నిప్పులు చెరిగారు. ఓ వైపు పార్టీ అధినేతను దూషిస్తూనే... మరోవైపు తాను ప్రభుత్వాన్ని అంటున్నానని రఘురాజు అతితెలివి ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. 

రఘురాజుపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ ను గత రెండేళ్లుగా తాము కోరుతున్నామని చెప్పారు. అనర్హత వేటుపై ఆలస్యం చేయవద్దని కోరినప్పటికీ ఇంత వరకు ఎలాంటి ప్రతిస్పందన లేదని అన్నారు. ప్రధాని మోదీపై బీజేపీ చట్టసభ సభ్యులెవరైనా విమర్శలు చేస్తే ఇలాగే చూస్తూ ఊరుకుంటారా? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News