Medha Kirit Somaiya: శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పై రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేసిన బీజేపీ నేత అర్ధాంగి

Medha Kirit Somaiya files defamation suit against Shivsena MP Sanjay Raut
  • కిరీట్ సోమయ్య అర్ధాంగిపై సంజయ్ రౌత్ ఆరోపణలు
  • పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణంలో స్కామ్ జరిగిందన్న సంజయ్  
  • రూ.100 కోట్ల అవినీతికి పాల్పడ్డారని వ్యాఖ్యలు
  • ఖండించిన కిరీట్ సోమయ్య దంపతులు
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చిక్కుల్లోపడ్డారు. బీజేపీ నేత కిరీట్ సోమయ్య అర్ధాంగి మేధా ఎంపీ సంజయ్ రౌత్ పై రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేశారు. ఈ మేరకు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. సంజయ్ రౌత్ ఇటీవల కిరీట్ సోమయ్య దంపతులపై తీవ్ర ఆరోపణలు చేశారు. పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం స్కామ్ లో రూ.100 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇందులో మేధా, ఆమె భర్త కిరీట్ సోమయ్యలకు భాగం ఉందని తెలిపారు. 

అయితే, సంజయ్ రౌత్ ఆరోపణలను కిరీట్ సోమయ్య దంపతులు ఖండించారు. కిరీట్ సోమయ్య దీనిపై మాట్లాడుతూ, పరువునష్టం దావా ద్వారా తామేమీ డబ్బును కోరుకోవడంలేదని, ఆ డబ్బును సామాజిక సేవలకు వినియోగిస్తామని చెప్పారు. చేసిన ఆరోపణలకు సంజయ్ రౌత్ తో పాటు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కూడా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కాగా, మేధా ఈ నెల మొదట్లోనే సంజయ్ రౌత్ పై ఫిర్యాదు దాఖలు చేశారు. మీడియా, సోషల్ మీడియా ద్వారా తమపై విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
Medha Kirit Somaiya
Kirit Somaiya
Sanjay Raut
Defamation Suit

More Telugu News