KTR: కేటీఆర్‌తో భేటీపై వేదాంత గ్రూప్ చైర్మ‌న్ అనిల్ అగ‌ర్వాల్ స్పంద‌న ఇదే!

vedanta group chairman comments on meeting with ktr in london
  • లండ‌న్ టూర్‌లో అగ‌ర్వాల్‌తో కేటీఆర్ భేటీ
  • ఈ భేటీపై కేటీఆర్ ట్వీట్‌కు రీ ట్వీట్ చేసిన అగ‌ర్వాల్‌
  • త్వ‌ర‌లో హైద‌రాబాద్ వ‌స్తానంటూ వెల్ల‌డి
తెలంగాణ‌కు పెట్టుబ‌డులు రాబ‌ట్ట‌డ‌మే ల‌క్ష్యంగా ఆ రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గ‌త వారం లండ‌న్‌లో ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ప‌లు దిగ్గ‌జ కంపెనీ ప్ర‌తినిధులతో భేటీలు నిర్వ‌హించిన కేటీఆర్‌.. భార‌త్‌కు చెందిన వేదాంత గ్రూప్ చైర్మ‌న్ అనిల్ అగ‌ర్వాల్‌తోనూ ప్ర‌త్యేకంగా భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ భేటీ ముగిసిన వెంట‌నే అనిల్‌తో తాను దిగిన ఫొటోను ట్వీట్ చేసిన కేటీఆర్‌... అగ‌ర్వాల్‌ను హైద‌రాబాద్‌కు ఆహ్వానించిన‌ట్లు తెలిపిన విష‌య‌మూ విదిత‌మే.

తాజాగా లండ‌న్ ప‌ర్య‌ట‌న ముగించుకున్న కేటీఆర్ అటు నుంచి అటే దావోస్‌లో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ ఎక‌న‌మిక్ ఫోరం స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యారు. ఈ క్ర‌మంలో త‌న‌తో భేటీపై కేటీఆర్ చేసిన ట్వీట్‌పై సోమ‌వారం అనిల్ అగ‌ర్వాల్ స్పందించారు. కేటీఆర్‌తో భేటీ సంద‌ర్భంగా భార‌త్ గురించి, భార‌త్‌లోని అపార అవ‌కాశాల గురించి చ‌ర్చించామ‌ని ఆయ‌న తెలిపారు. అంతేకాకుండా కేటీఆర్ ఆహ్వానం మేర‌కు త్వ‌ర‌లోనే హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తానంటూ అనిల్ అగ‌ర్వాల్ తెలిపారు.
KTR
Telangana
TRS
London
Vedanta Group
Anil Agarwal
Hyderabad

More Telugu News