Sai Pallavi: 'ఊ అంటావా మామ' లాంటి పాటల్లో నటిస్తారా? అనే ప్రశ్నకు సాయి పల్లవి సమాధానం ఇదే!

Sai Pallavi says she will not do item songs
  • ఐటెం సాంగులను చేయనని చెప్పిన సాయి పల్లవి
  • వస్త్రధారణ సరిగా లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుందని వ్యాఖ్య
  • అలాంటి పాటలు చేయాలనే ఆసక్తి తనకు లేదని వెల్లడి
తన కెరీర్ ప్రారంభం నుంచి పలు వైవిధ్యభరితమైన పాత్రల్లో నటిస్తూ మంచి టాలెంటెడ్ నటిగా సాయి పల్లవి గుర్తింపు తెచ్చుకుంది. ఒక నటిగా తొలి నుంచి కూడా ఆమె కొన్ని పరిధులను విధించుకుంది. గ్లామర్ పాత్రలకు, ఎక్స్ పోజింగ్ కు ఆమె దూరంగా ఉంది. ఇప్పటి వరకు ఏ చిత్రంలో కూడా ఆమె స్కిన్ షో చేయలేదు. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఐటెం సాంగుల గురించి అడిగిన ఒక ప్రశ్నకు సాయిపల్లవి తనదైన శైలిలో సమాధానమిచ్చింది. 'పుష్ప' చిత్రంలో 'ఊ అంటావా మామ' పాట, 'రంగస్థలం' సినిమాలో 'జిగేలు రాణి' వంటి ఐటెం సాంగ్స్ లో అవకాశం వస్తే నటిస్తారా? అనే ప్రశ్న ఆమెకు ఎదురయింది. దీనికి సమాధానంగా... 'చేయను' అని స్పష్టంగా చెప్పేసింది. 

ఐటెం సాంగులు తనకు కంఫర్ట్ గా ఉండవని సాయి పల్లవి తెలిపింది. అలాంటి వాటిలో అవకాశం వచ్చినా చేయనని చెప్పేస్తానని స్పష్టం చేసింది. వస్త్రధారణ సరిగా లేకపోతే తనకు చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పింది. అలాంటి పాటలు చేయాలనే ఆసక్తి కూడా తనకు లేదని తెలిపింది. జీవితానికి కెరీర్ ఎంత ముఖ్యమో ప్రేమ కూడా అంతే ముఖ్యమని... రెండింటిలో ఏది లేకపోయినా జీవితం సంపూర్ణం కాదని చెప్పింది.
Sai Pallavi
Item Songs
Tollywood

More Telugu News