'అంటే .. సుందరానికీ' నుంచి సాంగ్ రిలీజ్!

23-05-2022 Mon 17:49
  • వివేక్ ఆత్రేయ నుంచి 'అంటే .. సుందరానికీ'
  • అమాయకుడైన సుందరం పాత్రలో నాని 
  • ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమవుతున్న నజ్రియా
  • జూన్ 10వ తేదీన ఈ సినిమా రిలీజ్ 
Anate Sundaraniki lyrical song released
నాని హీరోగా దర్శకుడు వివేక్ ఆత్రేయ 'అంటే .. సుందరానికీ' సినిమాను రూపొందించాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాతో, మలయాళ బ్యూటీ నజ్రియా తెలుగు తెరకి పరిచయం కానుంది. వివేక్ సాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. 

'అనుకుందోటి .. అయిందోటి .. రంగో రంగా .., మొక్కిందోటి .. దక్కిందోటి రంగో రంగా' అంటూ ఈ పాట సాగుతోంది. భరద్వాజ్  పాత్రుడు రాసిన ఈ పాటను కారుణ్య  ఆలపించాడు. నానీకి ఎదురయ్యే పరిస్థితులను .. అనుభవాలను ఆవిష్కరించేదిగా ఈ పాట ఉంది. కథకి తగినట్టుగానే పాటకి కూడా కాస్త కామెడీ టచ్ ఇచ్చారు. 

 డిఫరెంట్ లుక్ తో నాని కనిపించే ఈ సినిమాలో, నరేశ్ .. నదియా .. రోహిణి ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. జూన్ 10వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతూ ఉండగానే, నాని 'దసరా' సినిమాను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు.