దుగ్గిరాల హ‌త్యాచార బాధితురాలి కుటుంబానికి రూ.5 ల‌క్ష‌ల సాయం అందించిన నారా లోకేశ్

23-05-2022 Mon 17:40
  • తుమ్మ‌పూడిలో ఇటీవ‌లే హ‌త్యాచారానికి గురైన తిరుప‌త‌మ్మ‌
  • బాధిత కుటుంబానికి రూ.5 ల‌క్ష‌ల సాయం ప్ర‌క‌టించిన టీడీపీ
  • బాధితురాలి కుమార్తె, కుమారుడి పేరిట ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయించిన లోకేశ్
  • ఏ స‌మ‌స్య ఉన్నా అన్న‌గా ఆదుకుంటాన‌ని హామీ
nara lokesh handed over 5 lack rupees cheques to tummapudi rape and murder victim family
మంగ‌ళ‌గిరి నియోజ‌కవ‌ర్గ ప‌రిధిలోని దుగ్గిరాల మండ‌లం తుమ్మ‌పూడి గ్రామంలో ఇటీవ‌లే హ‌త్యాచారానికి గురైన తిరుప‌త‌మ్మ కుటుంబానికి టీడీపీ త‌ర‌ఫున రూ.5 ల‌క్ష‌ల సాయం అందింది. ఈ మేర‌కు సోమ‌వారం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్...బాధిత కుటుంబాన్ని సంద‌ర్శించి రూ.5 ల‌క్ష‌ల ప‌రిహారం చెక్కుల‌ను అంద‌జేశారు. 

సోమ‌వారం తుమ్మ‌పూడిలోని బాధిత కుటుంబం నివాసానికి వెళ్లిన లోకేశ్... తిరుప‌త‌మ్మ కుమార్తె అఖిల పేరిట రూ.3 ల‌క్ష‌లు, కుమారుడు వ‌రుణ్ సాయి పేరిట రూ.2 ల‌క్ష‌ల ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయించిన చెక్కుల‌ను వారికి అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఎప్పుడు ఏ స‌మ‌స్య వ‌చ్చినా ఓ సోద‌రుడిలా ఆదుకుంటాన‌ని వారికి హామీ ఇచ్చారు.