Temple: కర్ణాటకలో ఓ మసీదు కింద హిందూ దేవాలయం వంటి నిర్మాణం గుర్తింపు

  • ఇటీవల జ్ఞానవాపి మసీదు బావిలో శివలింగం లభ్యం
  • అదే తరహాలో మరో ఘటన
  • మంగళూరులో మసీదు ఆధునికీకరణ పనులు
  • నిర్ధారణ జరిగే వరకు పనులు ఆపేయాలన్న వీహెచ్ పీ
Temple like structure identified at a mosque in Mangaluru

ఇటీవల ఉత్తరప్రదేశ్, వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో ఓ బావిలో శివలింగం లభ్యమైన సంఘటన తరహాలోనే, కర్ణాటకలో ఓ మసీదు కింద హిందూ దేవాలయం వంటి నిర్మాణం బయల్పడింది. మంగళూరు నగర శివార్లలోని మలాలీ మార్కెట్ మసీదు ఆధునికీకరణ పనులు చేపడుతుండగా, ఈ ఆలయం వంటి నిర్మాణం మసీదు కింద భాగంలో ఉన్నట్టు గుర్తించారు. ఈ స్థలంలో మసీదు నిర్మించడానికి పూర్వం ఓ ఆలయం ఉండేదని స్థానిక సంఘాలు అంటున్నాయి. 

దీనిపై విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) నేతలు స్పందిస్తూ, దీనికి సంబంధించిన పత్రాలను పరిశీలించి నిర్ధారణ జరిపేంత వరకు, మసీదు ఆధునికీకరణ పనులు నిలిపివేయాలని జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేశారు. కాగా, ఇక్కడ పూజా కార్యక్రమాలు చేపట్టాలని కూడా వీహెచ్ పీ వర్గాలు భావిసున్నట్టు తెలుస్తోంది.

More Telugu News