విరాళాల కోసం టీడీపీ పిలుపున‌కు భారీ స్పంద‌న‌

23-05-2022 Mon 16:03
  • ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరుకు విరాళాలు అవ‌స‌రమన్న టీడీపీ 
  • స్వ‌చ్ఛందంగా విరాళాల‌కు టీడీపీ పిలుపు
  • రూ.5 ల‌క్ష‌లిచ్చిన విజ‌య‌వాడ వాసి దేవినేని చంద్ర‌శేఖ‌ర్‌
  • కృత‌జ్ఞ‌త తెలుపుతూ టీడీపీ ట్వీట్‌
tdp urges voluntary donations from people
ఏపీలో ప్రధాన ప్ర‌తిప‌క్షం తెలుగు దేశం పార్టీ (టీడీపీ) విరాళాల కోసం పిలుపునిచ్చింది. ప్రజలకు అండగా నిలిచి వారి సమస్యలపై పోరాడేందుకు... సమాజానికి  ఉత్తమ రాజకీయాలను అందించేందుకు పార్టీకి ప్రజల మద్దతు, సహకారం అవసరమ‌ని పేర్కొన్న టీడీపీ... అందుకే ప్రజల నుంచి స్వచ్ఛంద విరాళాలకు పిలుపు ఇచ్చామ‌ని తెలిపింది. ఈ పిలుపున‌కు స్పందించి పార్టీకి విరాళాలు అందించిన ప్రతి ఒక్కరికీ ఆ పార్టీ ప్ర‌త్యేకంగా ధన్యవాదాలు తెలిపింది.

టీడీపీ ఇచ్చిన ఈ పిలుపున‌కు స్పందించిన టీడీపీ యువ నేత, విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన పార్టీ యువ నేత దేవినేని చంద్ర‌శేఖర్ రూ.5 ల‌క్ష‌ల విరాళాన్ని అందించారు. ఈ మేర‌కు ఆయ‌న విరాళం త‌మ‌కు అందింద‌ని తెలిపిన టీడీపీ... ఆయ‌న‌కు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. ఈ సంద‌ర్భంగా తెలుగు దేశం పార్టీకి విరాళం... ఉత్త‌మ రాజ‌కీయాల‌కు స‌హ‌కారం అన్న నినాదాన్ని ఆ పార్టీ ప్ర‌ధానంగా ప్ర‌స్తావించింది.