తీవ్ర ఒత్తిడికి గురైన మెటల్స్ సూచీ... నష్టాల్లో ముగిసిన మార్కెట్లు!

23-05-2022 Mon 16:03
  • 37 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 51 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • 12.53 శాతం నష్టపోయిన టాటా స్టీల్ షేర్ విలువ
Markets ends in losses
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఉదయం నుంచి మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య ట్రేడ్ అయ్యాయి. ఐరన్ ఓర్, పెల్లెట్స్ ఎగుమతులపై ప్రభుత్వం ఎక్స్ పోర్ట్స్ డ్యూటీని పెంచడం మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. దీంతో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 37 పాయింట్లు కోల్పోయి 54,288కి పడిపోయింది. నిఫ్టీ 51 పాయింట్లు నష్టపోయి 16,214 వద్ద స్థిరపడింది. మెటల్ సూచీ అత్యధికంగా 8 శాతానికి పైగా నష్టపోయింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (4.14%), మారుతి (4.07%), హిందుస్థాన్ యూనిలీవర్ (2.35%), ఎల్ అండ్ టీ (2.21%), ఏసియన్ పెయింట్స్ (2.07%). 

టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-12.53%), అల్ట్రాటెక్ సిమెంట్ (-3.33%), ఐటీసీ (-1.93%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.72%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.40%).