టీ కాంగ్రెస్ సోష‌ల్ మీడియా సైన్యం ఇదేన‌ట‌!

23-05-2022 Mon 15:33
  • రేవంత్ టీపీసీసీ చీఫ్ అయ్యాక యాక్టివ్‌గా టీ కాంగ్రెస్‌ సోష‌ల్ మీడియా
  • రాహుల్ టూర్‌తో మ‌రింత ఉత్సాహంగా టీం స‌భ్యులు
  • గాంధీ భ‌వ‌న్ ముందు ఫొటో దిగిన టీకాంగ్ సోష‌ల్ మీడియా టీం
this is the t cpngress social media team members photo
మ‌ల్కాజిగిరీ ఎంపీ రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్య‌క్షుడిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత  టీ కాంగ్రెస్ సోష‌ల్ మీడియా చాలా యాక్టివ్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చి వెళ్లిన త‌ర్వాత ఈ బృందం మ‌రింత యాక్టివ్ అయిపోయింది. ప్ర‌తి అంశం మీద క్ష‌ణ కాలం కూడా ఆల‌స్యం చేయ‌కుండా పార్టీ వైఖ‌రిని వెల్ల‌డిస్తూ సాగుతున్న ఈ బృందం చ‌ర్య‌ల‌తో పార్టీ శ్రేణుల్లోనూ కొత్త ఉత్సాహం క‌నిపిస్తోంది. 

సోమ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా టీ కాంగ్రెస్ కార్యాల‌యం గాంధీ భ‌వ‌న్ మెట్ల ముందు ఓ బృందం క‌నిపించింది. ఇదే టీ కాంగ్రెస్ సోష‌ల్ మీడియా బృంద‌మ‌ట‌. ఈ విష‌యాన్ని ఆ బృందం స‌భ్యుడు, ఫొటోలో ఉన్న న‌వీన్ అనే వ్య‌క్తి వెల్ల‌డించారు. ఆయ‌నే ఈ ఫొటోను విడుద‌ల చేశారు.