అవినీతి డాక్టర్ ను అక్కడికక్కడే సస్పెండ్ చేసిన ఆరోగ్యమంత్రి హరీశ్ రావు

23-05-2022 Mon 14:14
  • వైద్యుడి లంచావతారం
  • హరీశ్ రావుకు ఫిర్యాదులు
  • కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు
  • సిబ్బందిని హెచ్చరించిన హరీశ్ రావు
Harish Rao sudden visit at Kondapur Area Hospital and suspended a doctor
తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఇవాళ కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ ఆసుపత్రిలోని ఓ వైద్యుడి లంచావతారంపై కొందరు మంత్రికి ఫిర్యాదు చేశారు. దాంతో ఆసుపత్రికి వెళ్లిన హరీశ్ రావు... వైద్యుడి అవినీతిని గుర్తించి అతడిని అక్కడికక్కడే సస్పెండ్ చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్ నెస్ సర్టిఫికెట్ కోసం ఆ డాక్టర్ లంచం అడుగుతుండడంతో మంత్రి పైవిధంగా చర్యలు తీసుకున్నారు. 

అంతేకాదు, ఇతర సిబ్బంది కూడా జాగ్రత్తగా ఉండాలని, లంచాలు, అవినీతి జోలికి వెళితే కఠిన చర్యలు తప్పవని హరీశ్ రావు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి అంతా కలియదిరిగిన హరీశ్ రావు రోగులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు.