కోర్టుకు రాలేను అని చేతకాని కబుర్లు చెప్పం.. సింహంలా ఎదుర్కొంటాం: కొల్లు రవీంద్ర

23-05-2022 Mon 14:08
  • కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారంటూ లోకేశ్ పై కేసు
  • ఈరోజు విజయవాడ కోర్టుకు హాజరైన లోకేశ్
  • కోర్టు వద్దకు పెద్ద సంఖ్యలో వచ్చిన టీడీపీ శ్రేణులు
We face cases like a lion says Kollu Ravindra
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శలు గుప్పించారు. కోర్టులకు రాను, రాలేను అంటూ చేతకాని కబుర్లను తాము చెప్పమని... కోర్టు కేసులను సింహంలా ఎదుర్కొంటామని అన్నారు. గతంలో అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన సమయంలో కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారంటూ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. 

ఈ కేసుకు సంబంధించి విజయవాడ కోర్టుకు ఈరోజు నారా లోకేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవినేని ఉమ, బొండా ఉమ, కొల్లు రవీంద్ర తదితర నేతలతో పాటు పెద్ద సంఖ్యలో టీడీపీ మద్దతుదారులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే కొల్లు రవీంద్ర పైవ్యాఖ్యలు చేశారు. కేసులను సింహంలా ఎదుర్కొంటామని అన్నారు.