అయినవారికి ఆకుల్లో.. కానివారికి కంచాల్లో అంటే ఇదేనేమో!: రేవంత్ రెడ్డి

23-05-2022 Mon 12:38
  • తెలంగాణలో రోజుకు ముగ్గురు రైతుల ఆత్మహత్యలన్న రేవంత్
  • ఒక్క కుటుంబాన్ని కూడా కేసీఆర్ పరామర్శించర‌ని విమ‌ర్శ‌
  • పంజాబ్ రైతులకు మాత్రం పరిహారం ఇచ్చారని వ్యాఖ్య‌
revant reddy slams kcr
పంజాబ్ లో మృతి చెందిన రైతుల కుటుంబాల‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం చేసిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ కేసీఆర్ పై టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు. 

''అయినవారికి ఆకుల్లో కానివారికి కంచాల్లో అంటే ఇదేనేమో! తెలంగాణలో రోజుకు ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఫాంహౌస్ గడప దాటి… ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించని కేసీఆర్ పంజాబ్ రైతులకు పరిహారం ఇచ్చారు. మర్మమేమిటో మన రైతన్నలకు అర్థం కాదనుకుంటున్నారా!'' అని రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ పంజాబ్ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన ప‌లు ఫొటోలను ఆయ‌న పోస్ట్ చేశారు.