Rakul Preet Singh: అందుకే మా రిలేషన్ షిప్ గురించి బయటి ప్రపంచానికి చెప్పాం: రకుల్ ప్రీత్ సింగ్

Rakul Preet Singh speaks about her relationship with Jackky
  • జాకీ భగ్నానీ ప్రేమలో రకుల్ ప్రీత్ సింగ్
  • ఇద్దరి అభిరుచులు కలవడంతో ప్రేమలో పడ్డామని వెల్లడి
  • రిలేషన్ షిప్ గురించి బయటపెట్టకపోతే అసత్య ప్రచారాలు జరుతాయన్న రకుల్
తన గ్లామర్, నటనతో దక్షిణాది ప్రేక్షకులను అలరించిన రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో సైతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె జాకీ భగ్నానీ అనే వ్యక్తి ప్రేమలో మునిగితేలుతోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన ప్రేమ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. జాకీ తనకు మంచి స్నేహితుడని.. ఇద్దరి అభిరుచులు కలవడంతో ప్రేమలో పడ్డామని చెప్పింది. తమ మధ్య రిలేషన్ షిప్ మొదలయినప్పుడే తమ బంధం గురించి వీలైనంత ఎక్కువగా బయటి ప్రపంచానికి తెలియజేయాలనుకున్నామని తెలిపింది. 

తమ రిలేషన్ షిప్ గురించి తాము బయటపెట్టకపోతే... అసత్య ప్రచారాలు జరుగుతాయని, వాటితో ప్రశాంతతను కోల్పోతామని రకుల్ చెప్పింది. అందరూ తమ పని గురించి మాట్లాడుకోవాలని... తమ పర్సనల్ లైఫ్ గురించి కాదని వ్యాఖ్యానించింది. మన జీవితాల్లో తల్లిదండ్రులు, సోదరీసోదరులు, స్నేహితులు ఎలా ఉంటారో... అలాగే మనకంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తి కూడా ఉంటాడని చెప్పింది. సెలబ్రిటీల జీవితంపై అందరూ దృష్టి సారిస్తారని... అందుకే తాము తమ రిలేషన్ షిప్ గురించి బహిరంగంగా చెప్పేశామని తెలిపింది.
Rakul Preet Singh
Tollywood
Bollywood
Love
Relationship

More Telugu News