బాలయ్యతో అనిల్ రావిపూడి చేసే సినిమా వేరే లెవెల్లో ఉంటుందట!

23-05-2022 Mon 11:28
  • అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ బాలయ్యతో
  • తండ్రీకూతుళ్ల చుట్టూ తిరిగే కథ అని చెప్పిన అనిల్ 
  • బాలయ్యను కొత్తగా చూపిస్తానంటూ వ్యాఖ్య 
  • కూతురు పాత్రలో శ్రీలీల చేస్తుందంటూ వెల్లడి  
Balakrishna in Anil Ravipudi movie
రచన వైపు నుంచి డైరెక్షన్ వైపు వచ్చినవారిలో త్రివిక్రమ్ .. కొరటాల తరువాత స్థానంలో అనిల్ రావిపూడి కనిపిస్తాడు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'ఎఫ్ 3' సినిమా ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత సినిమాను ఆయన బాలకృష్ణతో చేయనున్నాడు. 
 
తాజాగా ఆ సినిమాను గురించి అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. "ఈ సినిమాలో బాలకృష్ణ యాభై ఏళ్లున్న తండ్రి పాత్రలో కనిపిస్తారు. ఆయన కూతురి పాత్రలో శ్రీలీల నటిస్తుంది. తండ్రీ కూతుళ్ల అనుబంధానికి సంబంధించిన కథ ఇది. నా మార్క్ కామెడీ తక్కువగా ఉంటుంది. బాలయ్య మార్కు యాక్షన్ ఎక్కువగా ఉంటుంది.

బాలకృష్ణను ఇంతవరకూ ఎవరూ చూపించని విధంగా ఈ సినిమాలో ఆయనను చూపిస్తాను. ఆయన క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆయన కెరియర్లోనే ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలుస్తుందని చెప్పగలను. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా వేరే లెవెల్లో ఉంటుంది. ఒక రకంగా ఆయనతో నేను చేసేది సినిమా అనేదానికంటే ప్రయోగం అంటేనే కరెక్టుగా ఉంటుంది" అని చెప్పుకొచ్చాడు.