జోరుగా జరుగుతున్న 'ఖుషి' షూటింగ్!

23-05-2022 Mon 10:54
  • విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా రానున్న 'లైగర్'
  • అదే కాంబినేషన్లో రూపొందనున్న 'జన గణ మన'
  • కశ్మీర్ లో ఫస్టు షెడ్యూల్ ను పూర్తిచేసుకున్న 'ఖుషి'
  • హైదరాబాదులో ప్లాన్ చేసిన సెకండ్ షెడ్యూల్
Khushi Movie Update
విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'లైగర్' సినిమా రూపొందుతోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఆగస్టు 25వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతోంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో 'జన గణ మన' రూపొందనున్న సంగతి తెలిసిందే. అయితే అంతకుముందే విజయ్ దేవరకొండ 'ఖుషి' సినిమా పూర్తిచేయనున్నాడు. 

ప్రేమకథల స్పెషలిస్టుగా చెప్పుకునే శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఖుషి' సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా సమంత అలరించనుంది. ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ ను కశ్మీర్ లో ప్లాన్ చేశారు. తాజాగా ఆ షెడ్యూల్ షూటింగును ఈ సినిమా టీమ్ పూర్తిచేసింది. నెక్స్ట్ షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు. 

సంగీత దర్శకుడిగా హీషమ్ ఈ సినిమాతో తెలుగు తెరకి పరిచయమవుతున్నాడు. ఇక సమంత విషయానికి వస్తే ఆమె ప్రధానమైన పాత్రను పోషించిన 'యశోద' విడుదలకి సిద్ధమవుతోంది. ఇక 'శాకుంతలం' కూడా ఈ ఏడాదిలోనే ప్రేక్షకులను పలకరించనుంది. ఇక మరో వైపున బాలీవుడ్ ప్రాజెక్టులతోను ఆమె బిజీగా ఉంది.