ఉద్రిక్తంగా కోనసీమ.. ఈరోజు నుంచి 144 సెక్షన్ అమలు!

23-05-2022 Mon 10:33
  • కోనసీమ జిల్లా పేరు బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్పు
  • పేరు మార్పును వ్యతిరేకిస్తూ కోనసీమలో పలువురు ఆందోళన
  • ఈరోజు నుంచి వారం పాటు సెక్షన్ 144 అమలు
Section 144 imposed in Konaseema
ఎప్పుడూ ఎంతో ప్రశాంతంగా ఉండే కోనసీమ ప్రాంతం ప్రస్తుతం ఉద్రిక్తంగా ఉంది. కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చడం వివాదానికి కారణమయింది. జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ పలువురు ఆందోళనలు చేపడుతున్నారు. మార్చిన పేరునే ఉంచాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోనసీమ ఉద్రిక్తంగా మారింది. పరిస్థితి చేజారకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

ఈ క్రమంలో ఈరోజు నుంచి వారం రోజుల పాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి తెలిపారు. కోనసీమలోని అమలాపురం, పి గన్నవరం నియోజకవర్గాలతో పాటు కాట్రేనికోన, కొత్తపేట, రావులపాలెం మండలాల్లో 144 సెక్షన్ విధించినట్టు చెప్పారు. 144 సెక్షన్ అమల్లో ఉన్న కారణంగా ఎవరూ కూడా బహిరంగసభలు, ర్యాలీలు, నిరసనలు నిర్వహించకూడదని శాంతిభద్రతలను అదుపులో ఉంచడం కోసం 450 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.