CM Jagan: దావోస్ లో వరుస సమావేశాలతో సీఎం జగన్ బిజీ

CM Jagan busy in Davos with crucial meetings
  • దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు
  • హాజరైన సీఎం జగన్
  • ఏపీకి పెట్టుబడుల కోసం ప్రయత్నాలు
  • జగన్ తో అదానీ, హాన్స్ బక్నర్ భేటీ
ఏపీకి పారిశ్రామిక పెట్టుబడులు తీసుకువచ్చే ఉద్దేశంతో స్విట్జర్లాండ్ లోని దావోస్ కు వెళ్లిన సీఎం జగన్ తొలిరోజు బిజీగా గడిపారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు సందర్భంగా ఏపీ పెవిలియన్ ప్రారంభించిన సీఎం జగన్ వరుసగా అనేకమంది వ్యాపార ప్రముఖులతో సమావేశమయ్యారు. 

బీసీజీ గ్లోబల్ చైర్మన్ హాన్స్ పాల్ బక్నర్ తో భేటీ అయ్యారు. డబ్ల్యూఈఎఫ్ వేదికపై అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సీఎం జగన్ ను కలిశారు. ఏపీలో పెట్టుబడులకు సంబంధించిన అంశాలను చర్చించారు. అటు, మహారాష్ట్ర టూరిజం మంత్రి ఆదిత్య థాకరే సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
CM Jagan
Davos
Meetings
AP Pavilion

More Telugu News