Beer: ప్రకాశం జిల్లాలో రోడ్డుపాలైన బీరు లోడు... ఎగబడిన జనాలు

Beer lorry overturns at Mulaguntapadu in Prakasam district
  • శ్రీకాకుళం నుంచి మదనపల్లె వెళుతున్న లారీ
  • లారీ నిండా బీరు సీసాలు
  • మూలగుంటపాడు వద్ద బోల్తా
  • బీరు సీసాల కోసం పోటీలుపడిన స్థానికులు
అసలే మండు వేసవి... రోడ్డుపై బీరు లారీ బోల్తా కొట్టింది... మందుబాబులకు ఇంకేం కావాలి..?.... వెంటనే అక్కడికి వాలిపోయారు... అందినకాడికి బీరు సీసాలు చేజిక్కించుకున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడు వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. 

శ్రీకాకుళం నుంచి ఓ లారీ బీరు సీసాల లోడుతో చిత్తూరు జిల్లా మదనపల్లె బయల్దేరింది. అయితే, ప్రకాశం జిల్లాలో మూలగుంటపాడు వద్ద అదుపుతప్పి రోడ్డుపై బోల్తాపడింది. వాహనంలో ఉన్న బీరు సీసాలన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే అక్కడికి పరుగులు తీశారు. రోడ్డుపై పడిన బీరు సీసాలు తీసుకునేందుకు పోటీలుపడ్డారు. కాగా, పోలీసులు ఈ ఘటనపై స్పందించి, అక్కడికి చేరుకుని ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు.
Beer
Lorry
Road
Prakasam District

More Telugu News