Frontier Airlines: విమానంలో పండంటి బిడ్డకు జన్మనించిన మహిళ.. ‘స్కై’ అని పేరుపెట్టిన కుటుంబ సభ్యులు

Woman delivers baby in lavatory aboard Frontier Airlines flight to Florida names her Sky
  • డెన్వర్ నుంచి ఒర్లాండో వెళ్తున్న విమానం
  • విమానం టేకాఫ్ అయిన కాసేపటికే మహిళకు పురిటి నొప్పులు
  • బాత్రూములో పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చిన మహిళ
అమెరికాలోని డెన్వర్ నుంచి ఒర్లాండో వెళ్తున్న విమానంలో ఓ ప్రయాణికురాలు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. విమానంలో పుట్టిన ఆ పాపకు కుటుంబ సభ్యులు ‘స్కై’ అని నామకరణం చేయడం విశేషం. ఫ్రాంటియర్ ఎయిర్ లైన్స్ విమానం డెన్వర్ నుంచి ఒర్లాండో బయలుదేరింది. అందులో షకేరియా మార్టిన్ అనే నిండు గర్భిణి కూడా ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. విమాన సిబ్బందిలో ఒకరైన డయానా గిరాల్డో వెంటనే స్పందించి నొప్పులతో బాధపడుతున్న షకేరియాను బాత్రూములోకి తీసుకెళ్లగా అందులోనే ఆమె ప్రసవించింది. 

షకేరియా సుఖ ప్రసవానికి సహకరించిన డయానును ప్రయాణికులు, విమానయాన సంస్థ అధికారులు ప్రశంసించారు. మరోవైపు, విమానం గాల్లో ఉండగా జన్మించిన ఆ శిశువుకు కుటుంబ సభ్యులు ‘స్కై’గా నామకరణం చేశారు. ఒర్లాండో విమానాశ్రయ సిబ్బందికి విషయం తెలియజేయడంతో విమానం ల్యాండ్ కాగానే షకేరియా, ఆమె బిడ్డను ఆసుపత్రికి తరలించారు.
Frontier Airlines
Florida
Sky
America

More Telugu News