Sidhu: జైల్లో గత 24 గంటలుగా ఆహారం ముట్టని సిద్ధూ

Sidhu has taken no food for last 24 hours in jail as per his advocate
  • 34 ఏళ్ల నాటి కేసులో సిద్ధూకి జైలు శిక్ష
  • సిద్ధూని పాటియాలా కోర్టుకు తరలించిన పోలీసులు
  • గత రాత్రి చపాతీలు ఇచ్చిన జైలు అధికారులు
  • తనకు గోధుమలు సరిపడవని నిరాకరించిన సిద్ధూ
ఓ వృద్ధుడిపై దాడి చేసి అతడి మరణానికి కారకుడయ్యాడన్న 1988 నాటి కేసులో పంజాబ్ రాజకీయనేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకు కోర్టు జైలు శిక్ష విధించడం తెలిసిందే. దీంతో ఆయన నిన్ననే కోర్టులో లొంగిపోవడంతో, పోలీసులు ఆయనను పాటియాలా జైలుకు తరలించారు. 

అయితే, గతరాత్రి నుంచి సిద్ధూ ఎలాంటి ఆహారం తీసుకోలేదని ఆయన న్యాయవాది హెచ్ పీఎస్ వర్మ నేటి సాయంత్రం వెల్లడించారు. శుక్రవారం రాత్రి జైలు అధికారులు చపాతీలు ఇవ్వగా, తనకు గోధుమలు పడవని, అలెర్జీ ఉందని సిద్ధూ ఆహారం నిరాకరించినట్టు వర్మ తెలిపారు. తన క్లయింట్ సిద్ధూ ఆరోగ్య పరిస్థితికి సరిపడే ఆహారాన్ని అందించాలని జైలు అధికారులను ఆదేశించాలంటూ న్యాయవాది వర్మ పాటియాలా కోర్టును ఆశ్రయించారు. తాను ఉదయం నుంచి కోర్టులోనే ఉన్నానని, జైలు అధికారుల కోసం ఎదురుచూస్తున్నానని, అయితే ఇప్పటిదాకా జైలు అధికారులు ఎవరూ రాలేదని ఆరోపించారు.
Sidhu
Jail
Food
Allergy
Punjab

More Telugu News