CM KCR: కేజ్రీవాల్ తో కలిసి ఢిల్లీలో ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన సీఎం కేసీఆర్

CM KCR visits a govt school in Delhi along with Arvind Kejriwal
  • ఢిల్లీలో కేసీఆర్ పర్యటన
  • అఖిలేశ్ యాదవ్ తో భేటీ
  • అనంతరం ఓ ప్రభుత్వ పాఠశాలకు పయనం
  • కేసీఆర్ వెంట కేజ్రీవాల్
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ వరుస భేటీలతో కేసీఆర్ బిజీగా గడిపారు. యూపీ విపక్ష నేత అఖిలేశ్ యాదవ్ తో భేటీ అయిన కేసీఆర్, అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. సౌత్ మోతీ భాగ్ లోని ఆ ప్రభుత్వ పాఠశాలలో పర్యటించిన కేసీఆర్ అక్కడి వసతులను, తరగతి గదులను పరిశీలించారు. కేజ్రీవాల్ ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కాగా, వీరిరువురు ఢిల్లీలోని మొహల్లా క్లినిక్ లను కూడా సందర్శించనున్నారు.

జాతీయ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ ఈ నెల 22న చండీగఢ్ వెళ్లనున్నారు. రైతుల ఉద్యమం సందర్భంగా మరణించిన 600 మంది అన్నదాతల కుటుంబ సభ్యులకు రూ.3 లక్షల చొప్పున చెక్కులు అందించనున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ లతో కలిసి కేసీఆర్ ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.
CM KCR
Arvind Kejriwal
Govt School
Delhi

More Telugu News