Om Prakash Chautala: మరో కేసులో దోషిగా హ‌ర్యానా మాజీ సీఎం... 26న శిక్ష ఖ‌రారు

Rouse Avenue Court of Delhiconvicts former Haryana Chief Minister Om Prakash Chautala in the disproportionate assets case
  • టీచ‌ర్ల కుంభ‌కోణంలో చౌతాలాకు ప‌దేళ్ల జైలు శిక్ష‌
  • శిక్ష ముగించుకుని వ‌చ్చిన ఏడాదిలోపే రెండో కేసులో దోషి
  • ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఢిల్లీ కోర్టు తీర్పు
  • 26న శిక్ష‌ను ఖ‌రారు చేయ‌నున్న కోర్టు
హ‌ర్యానా మాజీ సీఎం ఓం ప్ర‌కాశ్ చౌతాలా మ‌రో కేసులో దోషిగా తేలారు. ఇప్ప‌టికే టీచ‌ర్ల కుంభ‌కోణంలో ఆయన దోషిగా నిరూపితమై, ప‌దేళ్ల పాటు జైలు జీవితం గ‌డిపిన సంగ‌తి తెలిసిందే. జైలు శిక్ష పూర్తి చేసుకుని గ‌తేడాది జులైలో ఆయ‌న విడుద‌ల‌య్యారు. ప‌దేళ్ల జైలు శిక్ష అనుభ‌వించి వ‌చ్చి ఏడాది కాక‌ముందే మ‌రో కేసులో దోషిగా తేలిన ఆయ‌నకు ఈ సారి ఏ త‌ర‌హా శిక్ష ప‌డుతుంద‌న్నది ఆస‌క్తిక‌రంగా మారింది.

తాజా కేసు విష‌యానికి వ‌స్తే.. ఆదాయానికి మించి ఆస్తులు క‌లిగిన ఆరోప‌ణ‌ల‌పై చౌతాలాపై గ‌తంలోనే కేసు న‌మోదు అయ్యింది. ఈ కేసు విచార‌ణ‌ను చేప‌ట్టిన ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు శ‌నివారం చౌతాలాను దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో ఆయ‌న‌కు ఏ త‌ర‌హా శిక్ష విధించాల‌న్న విష‌యంపై కోర్టు ఈ నెల 26న చేప‌ట్ట‌నున్న విచార‌ణ‌లో నిర్ణ‌యం తీసుకోనుంది.
Om Prakash Chautala
Haryana
disproportionate assets Case
Rouse Avenue Court of Delhi

More Telugu News