వచ్చే ఏడాది మేలో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

21-05-2022 Sat 16:55
  • కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారన్న ఉత్తమ్ 
  • రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం ఖాయమని వ్యాఖ్య 
  • టీఆర్ఎస్ నేతలు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపణ 
Assembly elections will come in 2023 May says Uttam Kumar Reddy
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు. 2023 మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు రావడం ఖాయమని, అలాగే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 అసెంబ్లీ సీట్లను గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

 తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను కేసీఆర్ ఇంత వరకు పరామర్శించలేదని... కానీ, పంజాబ్ రైతు కుటుంబాలకు నగదు ఇవ్వడానికి ఆయన వెళ్లడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ నేతలు అంతులేని అవినీతికి పాల్పడుతున్నారని... రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని విమర్శించారు.