బెంగ‌ళూరును దాటేసిన హైద‌రాబాద్‌!.. టైమ్స్ క‌థ‌నాన్ని కోట్ చేస్తూ కేటీఆర్ ట్వీట్!

21-05-2022 Sat 15:32
  • ఆఫీస్ స్పేస్ లీజుల్లో టాప్ దిశ‌గా హైద‌రాబాద్‌
  • ఇప్ప‌టికే బెంగ‌ళూరును దాటేసిన వైనం
  • టైమ్స్ ఆఫ్ ఇండియా ప్ర‌త్యేక క‌థ‌నం
  • కార‌ణాలేంటో చెబుతూ కేటీఆర్ ట్వీట్‌
ktr tweet on times of india story over hyderabad development
ఐటీ రంగంలో బెంగళూరు, హైద‌రాబాద్‌ల మ‌ధ్య చాలా కాలం నుంచే పోటీ వాతావ‌ర‌ణం సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఐటీ రంగంలో తొలి స్థానంలో ఉన్న బెంగ‌ళూరును దాటేసి ఆ స్థానంలో హైద‌రాబాద్‌ను నిల‌పాల‌న్న క‌సితో తెలంగాణ ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చాలా కాలంగా శ్ర‌మిస్తున్నారు. 

ఈ దిశ‌గా ఏ చిన్న అవ‌కాశం దొరికినా దానిని ఆయ‌న వ‌ద‌ల‌డం లేదు. ఈ క్ర‌మంలో ప్ర‌ముఖ ఆంగ్ల దిన‌ప‌త్రిక టైమ్స్ ఆఫ్ ఇండియాలో శ‌నివారం ఓ క‌థ‌నం ప్ర‌చురిత‌మైంది. ఆఫీస్ స్పేస్ లీజులో బెంగ‌ళూరు న‌గ‌రాన్ని దాటేసిన హైద‌రాబాద్ ఈ విభాగంలో టాప్ పొజిష‌న్‌లోకి దూసుకెళుతోందంటూ ఆ క‌థ‌నం పేర్కొంది.

ఇదే క‌థ‌నాన్ని కోట్ చేస్తూ కేటీఆర్ శ‌నివారం ఓ ట్వీట్ చేశారు. ఆఫీస్ స్పేస్ లీజులో హైద‌రాబాద్ స‌త్తా చాటుతున్న‌ద‌ని పేర్కొన్న కేటీఆర్‌... అందుకు గ‌ల కార‌ణాల‌ను కూడా ప్ర‌స్తావించారు. త‌క్కువ అద్దెలే ఆఫీస్ స్పేస్ లీజుల్లో హైద‌రాబాద్‌ను అగ్ర స్థానానికి తీసుకెళుతున్నాయ‌ని కేటీఆర్ తెలిపారు.