ఇలాంటి ప్రభుత్వాలకు లాలూ భయపడరు: తేజ‌స్వి యాద‌వ్

21-05-2022 Sat 15:27
  • లాలూపై మరో కేసు నమోదు చేసిన సీబీఐ
  • మోదీ ప్రభుత్వానికి లాలూ వెన్ను చూపరన్న తేజస్వి 
  • ఈ పోరాటంలో విజయం సాధిస్తామని ధీమా
Lalu will never bend his head in front of BJP says Tejashwi Yadav
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై సీబీఐ తాజాగా మరో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆయన రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఉద్యోగాలను ఇప్పించి వారి నుంచి భూములు, ఆస్తుల రూపంలో లంచాలు తీసుకున్నారని సీబీఐ అభియోగాలను మోపింది. ఈ క్రమంలో నిన్న లాలూకి చెందిన పలు చోట్ల సీబీఐ సోదాలను నిర్వహించింది. 

ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఆర్జేడీ నేత, లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ మండిపడ్డారు. ఇలాంటి ప్రభుత్వాలకు లాలూ భయపడరని, వెన్ను చూపరని అన్నారు. సత్య మార్గంలో పయనించడం చాలా కష్టమని... అయినా అసాధ్యం కాదని చెప్పారు. కాస్త ఆలస్యం అయినా చివరకు నిజమే గెలుస్తుందని అన్నారు. ఈ పోరాటంలో తాము విజయం సాధిస్తామని చెప్పారు.