బిగ్ బాస్ ఓటీటీ సీజన్ విన్నర్ ఆమేనా?... అయితే చరిత్ర సృష్టించినట్టే!

21-05-2022 Sat 15:07
  • ఓటీటీలో ప్రసారమైన బిగ్ బాస్ తాజా సీజన్
  • విన్నర్ బిందు మాధవి అంటూ ప్రచారం
  • ఇప్పటివరకు బిగ్ బాస్ లో విజేతగా నిలవని మహిళలు
Bigg Boss OTT version winner revealed
తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరుగాంచిన బిగ్ బాస్ ఈసారి ఓటీటీలో ప్రసారమైన సంగతి తెలిసిందే. గత కొన్ని సీజన్లుగా, ఎలిమినేట్ అయ్యేవారి పేర్లు ముందే లీకవుతున్నాయి. ఈ పర్యాయం ఓటీటీ సీజన్ విన్నర్ పేరు కూడా ముందే తెరపైకి వచ్చింది. హీరోయిన్ బిందు మాధవి బిగ్ బాస్ ఒటీటీ వెర్షన్ విజేతగా నిలిచిందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ బిందు మాధవి నిజంగానే విన్నర్ అయితే ఆమె చరిత్ర సృష్టించినట్టే భావించాలి. ఎందుకంటే, ఓ మహిళ ఇప్పటివరకు తెలుగు బిగ్ బాస్ షోలో విజేతగా నిలవలేదు.

తొలి సీజన్ లో శివబాలాజీ, రెండో సీజన్ లో కౌశల్, మూడో సీజన్ లో రాహుల్ సిప్లిగంజ్, నాలుగో సీజన్ లో అభిజీత్, ఐదో సీజన్ లో వీజే సన్నీ విజేతలుగా నిలిచారు. కాగా, బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ లో గతంలో బిగ్ బాస్ షోలో పాల్గొన్న వారికి కూడా అవకాశం ఇచ్చారు. అఖిల్ సార్థక్ కూడా ఆ విధంగానే మరోసారి హౌస్ లోకి ఎంటరయ్యాడు. సీజన్-4లో రన్నరప్ గా నిలిచిన అఖిల్ ఈసారి ఓటీటీ వెర్షన్ లో కూడా రన్నరప్ గానే నిలిచినట్టు సమాచారం.